భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్రనైవేద్యం!
లోకాలు, భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రసరాజ్యడోల!
నా ఊల కేదార గౌళ!
గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు, ఝరులు నా సోదరులు!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం!
---- శ్రీశ్రీ గారి మహాప్రస్థానం లో నాకు నచ్చిన బాట.....