English To Kannada - Words, Meanings, Sentences in Kannda, English, Hindi: Vegetables - English To Kannada thotakura in kannada
నేను
Tuesday, June 17, 2014
Sunday, October 20, 2013
అనంతాల అలసట తీర్చె ఒడి నీది
నీ బుజ్జాయి తప్పటడుగులను సరిదిద్దె చేయూత నీది
అమ్మతనం లొ స్నేహం కలిపె ఆప్యాయత నీది…
నీతొ పంతం ప్రేమని తెలియక వర్షించావేమొ,
నీ కంటి నీలాలు మున్నీరే నాకు...చిరునవ్వులు పన్నీరు
నీ నీడ సోకని క్షణం నాకు శూన్యం అనిపిస్తుంది…
నిన్ను తలవని రోజు నన్ను వైరాగ్యం ఆవహిస్తుంది…
పదే పదే గుర్తుకు వచ్చె నీ మాటలు, నాకు తెలియకనె పెదవులపై దరహాసం మొలిపిస్తాయి….
అనురాగానికి రూపం ఇస్తే నువ్వు, ప్రేమకు పోతపోస్తె నువ్వు…
చివరగా..
“ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం…ఎవరు పడగలరు అమ్మ అను రాగం కన్న తీయని గీతం”

(Last words from a song)
I wrote this as a note on a greeting card from my friend to her mother... most of the lines are from memories of her mother...
Saturday, May 22, 2010
సందేహం...సందిగ్ధం...
ఈ కాంక్రీటు అడవిలో,
చీమలవలె మసలే మనుష్యుల రొదలో,
నను నేను వెతుకాడె పనిలో,
పనిలో, వనిలో, గజిబిజి అలజడుల ధ్వనిలో,
నా యవ్వన ఆవేశపు బడబాగ్నుల వడిలో, ఒడిలో
ఊహల బలినై, అణిచే వామనుడనై,
సంచరించి...సంచలించి...
అలసి...సొలసి...మైకమై.....
చీమలవలె మసలే మనుష్యుల రొదలో,
నను నేను వెతుకాడె పనిలో,
పనిలో, వనిలో, గజిబిజి అలజడుల ధ్వనిలో,
నా యవ్వన ఆవేశపు బడబాగ్నుల వడిలో, ఒడిలో
ఊహల బలినై, అణిచే వామనుడనై,
సంచరించి...సంచలించి...
అలసి...సొలసి...మైకమై.....
నా దారి ఎడారి
స్నేహితులా స్వార్ధచింతనులు,
బంధువులా మోసపూరితులు,
తల్లిదండ్రులా అసక్తులు,
పరిస్థితులా అశనిపాతాలు...
బంధువులా మోసపూరితులు,
తల్లిదండ్రులా అసక్తులు,
పరిస్థితులా అశనిపాతాలు...
దురదృష్టానికి పరాకాష్టను,
అదృష్టానికి పేదవాడను.....
అదృష్టానికి పేదవాడను.....
ఆశలు మదిలో పువ్వులై అల్లుకున్నను,
ఆ పువ్వుల మకరందాన్ని ఆస్వాదించలేని తుమ్మెదను.....
మేక వన్నె పులుల మెర మెచ్చు మాటలలో కొట్టు మిట్టాడుతున్న అమాయకుడను.....
ఆ పువ్వుల మకరందాన్ని ఆస్వాదించలేని తుమ్మెదను.....
మేక వన్నె పులుల మెర మెచ్చు మాటలలో కొట్టు మిట్టాడుతున్న అమాయకుడను.....
కనుకే నా మనసు చెప్పింది నా దారి ఎడారని,
నేను వెతుకుతున్నాను నా భావ దాహాన్ని తీర్చే ఒయాసిస్సుని....
బ్రతుకు నావ
ఆలోచనల సహవాసంతో
ఆకాంక్షల ఆలంబనతో
కదులుతోంది కాలం నా భవిష్యత్తు వైపు...
ఆకాంక్షల ఆలంబనతో
కదులుతోంది కాలం నా భవిష్యత్తు వైపు...
అందమైన తీరాలను దాటుకుంటూ
మధురమైన అనుభూతులను ఆస్వాదిస్తూ
మరువలేని జ్ఞాపకాలను మిగుల్చుకుంటూ
పరిస్థితుల పెను తుఫానులు ఎన్ని ఎదురైనా ఆగనని చాటుకుంటూ కదులుతోంది....
మధురమైన అనుభూతులను ఆస్వాదిస్తూ
మరువలేని జ్ఞాపకాలను మిగుల్చుకుంటూ
పరిస్థితుల పెను తుఫానులు ఎన్ని ఎదురైనా ఆగనని చాటుకుంటూ కదులుతోంది....
ప్రశ్న
సమాధానం చెప్పలేను నాకు ఎదురైన ప్రశ్నలకు..
అందుకే మౌనాన్ని నేను వలచా,
ధైర్యంగా పరిస్థితులను ఎదిరించ నిలువదలచా....
నన్ను నేను మలుచుకుంటూ, విజయగీతికను పాడదలిచా....
అందుకే మౌనాన్ని నేను వలచా,
ధైర్యంగా పరిస్థితులను ఎదిరించ నిలువదలచా....
నన్ను నేను మలుచుకుంటూ, విజయగీతికను పాడదలిచా....
ఆశల మేఘం
నా ఆశలమేఘమా ఏమని పిలవను నిన్ను...
ఆలోచన అనా...ఉహ అనా...
ఆవేదన అనా...ఆనందం అనా...
ఆలోచన అనా...ఉహ అనా...
ఆవేదన అనా...ఆనందం అనా...
నువ్వు జార్చే ప్రతి చినుకు నన్ను తడిపేస్తుంది...
ఆ తడి నా కంటిని చేరి నీ వైపు నుండి దృష్టి మరల్చనీయకుంది...
ఆ తడి నా కంటిని చేరి నీ వైపు నుండి దృష్టి మరల్చనీయకుంది...
Subscribe to:
Posts (Atom)